
ఆకేరు న్యూస్, ములుగు: 186 వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఫోటోగ్రాఫర్లను ములుగు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా ములుగు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ అధునాతన కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఫోటోగ్రఫీ వృత్తిలో రాణిస్తున్న ఫోటోగ్రాఫర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ తరఫున సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ సందర్బంగా పలువురు ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా మమ్మల్ని సన్మానించడం సంతోషంగా ఉందని ములుగు లయన్స్ క్లబ్ అవసరార్థులను ఆదుకోవడంలో ముందుంటుందని వారికి ధన్యవాదాలు తెలిపారు. బాస్ స్టూడియో యజమాని లయన్ మాట్ల బద్రి ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఆసుపత్రి లో బ్రెడ్, పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడమైనది
ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ దొంతి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కార్యదర్శి లయన్ చుంచు రమేష్, లయన్ సానికొమ్మ రవీందర్ రెడ్డి లయన్ మాట్ల బద్రి ఫోటోగ్రాఫర్స్ కుసుమరాజు, కందుల రవీందర్, జక్కుల సదానందం అజ్మీర వెంకట్ సమ్మయ్య మాట్ల సంపత్ ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.
…………………………………….