
* వివాదాలు వద్దు.. విజ్ఞతతో ఆలోచించండి
* రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఆకేరున్యూస్ హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వివాదాలకు తావు ఇవ్వకుండా విజ్ఞతతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ( REVANTH REDDY) వివిధ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.1991 లో ప్రధాని అభ్యర్థిగా పివి నర్సింహారావు (PV NARSIMHA RAO)నంధ్యాల నుంచి పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశంతరపున నంద్యాల లో అభ్యర్థిని నిలబెట్టకుండా గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని రేవంత్ గుర్తుచేశారు. నీలం సంజీవరెడ్డి(NEELAM SANJEEVA REDDY), పీవీ నర్సింహారావుల తరువాత తెలుగువాడికి గొప్ప అవకాశం వచ్చిందని రాజకీయాలకతీతంగా అన్ని పార్టీల వాళ్లు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ( JUSTICE SUDERSHAN REDDY)కి మద్దతు తెలపాలని సీఎం రేవంత్ అన్నారు. నేడు దేశంలో వ్యవస్థలను అధికార బీజేపీ భ్రష్టుపట్టిస్తోందని రేవంత్ విమర్శించారు. బతికున్న ఓటర్లను చంపేసి లేని ఓటర్లును సృష్టించి నేడు ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని రేవంత్ అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే ఎన్డీయే కూటమి ఒక తరపున మహాత్మాగాంధీ స్పూర్తతో రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలు కాపాడే ఇండియా కూటమి ఒక తరపున ఉప్ప రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచాయని రేవంత్ అన్నారు. రాజకీయాలకతీతుడు, తెలంగాణ రైతు బిడ్డహైకోర్టు,సుప్రీం కోర్టు జస్టిస్ గా విశేష అనుభవం ఉన్నా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలిపించాలని రేవంత్ కోరారు. సుదర్శన్ రెడ్డి న్యాయనిపుణుడు, న్యాయకోవిదుడి అని నేడు దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరచాలని కోరారు. 40 మంది లోకసభ సభ్యులు 18 మంది రాజ్యసభ సభ్యులు కలిసికట్టుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన,బీఆర్ ఎస్, బీజేపీ , మజ్లిస్ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
………………………………………………………..