
* నోటిఫికేషన్ జారీ చేసిన ఎక్సైజ్ శాఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్: 2025-27 సంవత్సరాలకు గాను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులకు టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటీఫికేషన్ విడుదల చేసింది. లిక్కర్ షాపు కోసం కనీస ధరను 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. లైసెన్స్ కాలాన్ని1-12-2025 నుండి 30-11-2027 వరకు నిర్ణయించారు. గౌడ సామాజిక వర్గానికి 15 శాతం ఎస్సీ సామాజిక వర్గానికి 10 శాతం ఎస్టీ సామాజిక వర్గానికి 5 శాతం షాపులను కేటాయించనున్నారు. ఒకే దరఖాస్తుదారుడు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ లో వెల్లడించారు.
……………………………………