
* ఇద్దరు చిన్నారులను సంపులోకి తోసి..
* తానూ దూకిన తల్లి
* చిన్నారులు మృతి.. తల్లి సురక్షితం
ఆకేరు న్యూస, హైదరాబాద్ : హైదరాబాద్ బాచుపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తన బిడ్డలను సంపులోకి తోసేసి.. తల్లి కూడా దూకేసింది. ఈ ఘటనలో ఆ పసివాళ్లు ప్రాణాలు కోల్పోగా, తల్లిని స్థానికులు రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లి (Bachupally) పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మీ అనే మహిళ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ఓ చిన్నారి వయసు (8 నెలలు) మరో చిన్నారి వయసు (03) ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు కానీ లక్ష్మి తన ఇద్దరు చిన్నారులను ఇంటి ముందు ఉన్న సంపులో పడేసి తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని బయటకు తీశారు. కానీ ఇద్దరు చిన్నారులు అప్పటికే మృతి చెందారు. తల్లి లక్ష్మిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ (Gandhi Hospital) కి తరలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆ పసివాళ్ల మృతదేహాలను చూసిన వారు కంటతడి పెడుతున్నారు.
……………………………………….