
* ప్రేమించడం లేదని విద్యార్థి ఘాతకం
* మధ్యప్రదేశ్ లో ఘటన
ఆకేరున్యూస్ డెస్క్: పాఠాలు చెప్పిన టీచర్ పై ప్రేమను పెంచుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని టీచర్ కు చెప్పాడు. స్టూడెంట్ వ్యవహారాన్ని టీచర్ స్కూల్ యాజమాన్యానికి చెప్పడంతో ఆ టీచర్‌పై పెట్రోల్ తో దాడి చేసి గామపరిచాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్‌పూర్ జిల్లాలోని కొత్వాలి లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 18 ఏళ్ల సూర్యాంశ్ కొచ్చార్ అనే విద్యార్థి టీచర్ పై ప్రేమను పెంచుకొని ఆ విషయం ఆమెకు తెలుపగా ఆమె ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది, దీంతో స్పందించిన స్కూల్ యాజమాన్యం కొచ్చార్‌కు టీసీ ఇచ్చి పంపించారు. దీంతో మరో స్కూల్ లో చేరాడు ఈ క్రమంలో ఆగస్టు 15న టీచర్ ను కామెంట్ చేయగా ఆమె తీవ్ర అభ్యంతరం చెప్తూ కొచ్చార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. టీచర్ కోపాన్ని ప్రదర్శించడం జీర్ణించుకోలేని కొచ్చార్ ఆగస్టు 18న పెట్రోల్ బాటిల్ తో టీచర్ ఇంటికి వెళ్లాడు. టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను ఆర్పి టీచర్‌ను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళ్యాణ్ పూర్లో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీచర్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిసింది.
……………………………………………………………..