
* మంత్రి పొన్నం ప్రభాకర్
* అధికారులతో టెలీ కాన్ఫరెన్స్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కుస్తుండటం వలన విద్యార్థులకు సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని బీసీ సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గురువారం ఆయన బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్ , కమిషనర్ బాల మాయాదేవి , గురుకుల సెక్రెటరీ సైదులు, జాయింట్ సెక్రెటరీలు శ్యామ్ ప్రసాద్ ,తిరుపతి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పాఠశాలలు, హాస్టల్ భవనాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురుగు కాల్వలు లేకుండా నీరు నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. గడ్డి లేకుండా చూడాలని క్రిమికీటకాలు వచ్చే అవకాశం ఉందన్నారు. తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు నాణ్యమైన శుచీ శుభ్రతతో కూడిన భోజనం కల్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫాంలు,షూస్, అందించాలని కోరారు. నర్ణీత సమయంలో సెలబస్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఉంటే భర్తీ చేసుకోవాలని ఆదేశించారు.
………………………………..