
* వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కొరకు స్థల పరిశీలన చేసిన జిల్లాకలెక్టర్
ఆకేరు న్యూస్, ములుగు: జిల్లా కేంద్రంలో నూతనంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణమునకు ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు.
గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి సందర్శించారు. మార్కెట్ గురించి అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం బండారుపల్లిలోని జిల్లా పశు వైద్యశాఖ కార్యాలయ ఆవరణము ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఒకే మార్కెట్ ఉన్నందున, జిల్లా పశు వైద్య శాఖ కార్యాలయ ఆవరణంలో కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేష్, మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈ ఈ అజయ్ కుమార్, జిల్లా పశు వైద్య శాఖ అధికారి కొమురయ్య, ములుగు తహసిల్దార్ విజయభాస్కర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………….