
ఆకేరు న్యూస్, ములుగు: సమాజ సేవ లో భాగంగా ఏటూర్ నాగారం ఆరాధ్య హాస్పిటల్ యజమాన్యం, వైద్య సిబ్బంది. కొమురం భీమ్ నగర్ గుత్తికోయగూడెంలో ఉచిత హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు హాజరైనారు.మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ మంత్రి సీతక్క ను ఆదర్శంగా తీసుకొని సామాజిక సేవ చేయాలనే ఆలోచనతో ఏటూరునాగారం లోనీ ఆరాధ్య ఆస్పటల్ యజమాన్యం ఉచిత హెల్త్ క్యాంప్ కొమురం భీమ్ నగర్ ఏర్పాటు చేసి 25 కుటుంబాలకు చెందిన అందరికీ టెస్టులు చేసి మందులు ఇవ్వడం జరిగిందనీ, 365 రోజులు ఏలాంటి ఫీజులు లేకుండా ఆరాధ్య ఆస్పటల్ వారు చికిత్స చేస్తామని వారికీ హామీ ఇచ్చినారని అన్నారు.
డాక్టర్ కళ్యాణి, డాక్టర్ విష్ణుమోహన్, సివిల్ సర్జన్ సారంగపాణి ,ముక్కు చెవులు,గొంతు సర్జన్ నాగరాజు, గౌతమి, కవిత బాలు పాల్గొన్నారు.మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరాధ్య ఆస్పటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు,మండల యూత్ అధ్యక్షుడు గద్దల నవీన్,ములుగు మార్కెటింగ్ డైరెక్టర్ పెద్ది రాజబాబు, చిన్నబోయినపల్లి మాజీ సర్పంచ్ చేల లక్ష్మి వినయ్, కుంభం రాజేష్, కంట కృష్ణ ఠాగూర్, రమేష్,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
………………………………………….