
* మేమిద్దరం అక్కాచెల్లిళ్లం
*ఓర్వలేకనే ఆరోపణలు
* కొండా సురేఖతో ఉన్న అనుబంధంపై మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్. హైదరాబాద్ : కొండా సురేఖతో తనకు ఎలాంటి విభేదాల్లేవు అని సురేఖ తాను అక్కా చెల్లిళ్ల లాంటి వారమని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఆమె సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడారు. తమ మధ్య ,ఉన్న స్నేహాన్ని చూసి కొంతమంది ఓర్వలేక పోతున్నారని సీతక్క అన్నారు. ఆడబిడ్డలు రాజకీయాల్లో ఎదగడం కొంతమందికి ఇష్టం లేదని సీతక్క అన్నారు. ఏమైనా విభాదాలు ఉంటే రాజకీయంగా చిన్న చిన్న విభేదాలే తప్ప వాటిని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని సీతక్క అన్నారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నప్పుడే సమాజం సంతోషంగా ఉంటుందని సీతక్క అన్నారు.
…………………………………….