
* ఆగస్టు 31 అర్ధరాత్రి నుంచి ..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పేదకు ప్రజల ఆరోగ్యానికి ప్రైవేటు, కార్పొరేట్ ఇస్పత్రుల్లో ఉచితంగా
అందించే ఆరోగ్యశ్రీ సేవలు ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోనున్నాయి.
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్
హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్హెచ్ఏ) ఈ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీతోపాటు
జర్నలిస్టుల, ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్స్‌ను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం, ఆస్పత్రులపై ఆర్థికభారం పెరగడమే ఈ నిర్ణయానికి కారణమని టీఏఎన్హెచ్ఏ తెలిపింది.
…………………………………………………..