
* ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి
ఆకేరు న్యూస్, ములుగు: ప్రజల ఆర్థిక అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పరుచుకోవాలని ములుగు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి సూచించారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలో ఎర్రగడ్డలో జన జాతర కార్యక్రమంలో భాగంగా పశువుల పాక శంకుస్థాపన పనులకు జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు , తాడ్వాయి మండలం ఎంపీడీవో సుమన వాణి తో కలిసి పాల్గొన్నారు. సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. అభివృద్ధి లో భాగంగానే ఈ కార్యక్రమాలు చేపడుతున్నా మని వివరించారు. ఈ పథకాలను అర్హులైన వారు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. అనంతరం మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు బొల్లు దేవేందర్ ముదిరాజ్, పంచాయతీ కార్యదర్శి రేగ రాజశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ భట్టు రఘుపతి, టెక్నికల్ అసిస్టెంట్ రాజకుమార్ ,రైతులు బంగారు శ్రీరాములు, రమేష్ ,అల్లెం నవీన్ గంట మనోజ్ రెడ్డి,దుర్గం విశ్వనాథం,తాడ్వాయి మండల మాజీ సర్పంచ్ సునీల్ దొర తదితరులు పాల్గొన్నారు.
………………………………..