
ఆకేరు న్యూస్ , ములుగు: హనుమకొండ లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో జరిగిన భాషా సాంస్కృతిక శాఖ, అంజలి మీడియా గ్రూప్ కలిసి అట్టహాసంగా నిర్వహించిన కళా ప్రాంగణంలో ఓరుగల్లు జానపద జాతర –2025 కి గాను ఓరుగల్లు జానపద శిఖరాలు ఐన వరంగల్ శంకర్ , సారంగపాణిల కళా వారసత్వాన్ని కొనసాగింపులో భాగంగా పోరిక సామ్యల్ నాయక్ కు ములుగు ” ఫోక్ లెజెండ్ ” అవార్డును ప్రధానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పోరిక శ్యామల నాయక్ జూనియర్ ఘంటసాలగా, మరో నందమూరి తారక రామారావు లా అందరి మన్ననలు పొందారని వీరు నిర్వహించిన కళాయాత్ర ములుగు జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టాయని, ఒక గిరిజన కుటుంబంలో నుండి వచ్చిన ఆణిముత్యం అన్నారు. శ్యామల నాయక్ ఉపాధ్యాయునిగా మారుమూల గిరిజన గ్రామాలలో ఎంతో మంది పేద పిల్లలను విద్యతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడు విధంగా తీర్చిదిద్దారని మేము సైతం చేయలేని కళాయాత్రను ప్రజల ముందుకు తీసుకెళ్లి మన్ననలు పొందారన్నారు. ఉపాధ్యాయునిగా, కళాకారునిగా పేరున్న శ్యామల నాయక్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని రాజకీయాలలో రాణించినట్లయితే నిరంతరం ప్రజాసేవకే అంకితమవుతారని, రాజకీయాల్లో రాణించాలనీ వారు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. శ్యాముల్ నాయక్ మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అందరి దీవెనలు ఉంటే రాజకీయాలలో తప్పక రాణిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అందరి టీవీ అధినేత కామిశెట్టి రాజు పటేల్, గోల్కొండ బుచ్చన్న, తాళ్ల సునీల్, జూపాక శివ లు వరంగల్ శ్రీనివాస్ ,డాక్టర్ పసునూరి రవీందర్ ,గిద్దె రామ్ నరసయ్య ,వల్లంపట్ల నాగేశ్వరరావు , సీతాల ఘవేందర్, డాక్టర్ వెన్నెల శ్రీనాథ్ ,ధారా దేవేందర్ , రాగుల శంకర్ ,అజ్మీర వెంకట్ రామ్ నాయక్, రేలా విజయ్, కొడిమెల కిరణ్, మోతె రమేష్ , రఘు, రాణి లు పాల్గొన్నారు.
………………………………………………..