
* సురవరం సుధాకర్ రెడ్డికి కేటీఆర్ నివాళి
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు నల్లగొండ మాజీ ఎంపీ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి విలువలు కలిగిన నాయకుడని ఆయన మృతి తెలంగాణకు తీరని లోటు అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నివాళులర్పించారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి ( SURAVARAM SUDHAKAR REDDY)తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు అపారమైనవని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని వెల్లడించారు. ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. వారి కుటుంబానికి, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
………………………………