
* డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కమ్యూనిస్టు కీలక నేత సురవరం సుధాకర్ రెడ్డి మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pavan Kalyan) విచారం వ్యక్తం చేశారు. “ప్రముఖ కమ్యూనిస్ట్ నేత, సీపీఐ జాతీయ కార్యదర్శిగా మూడు దఫాలు బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ సురవరం సుధాకర్ రెడ్డి (Sudkharkar reddy) గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీ సుధాకర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. విద్యార్థి దశ నుంచి పోరాట పంథాలో నడిచిన ఆయన తదనంతర కాలంలో రైతులు, కార్మికులు పక్షాన బలంగా గళం వినిపించారు. లోక్ సభ సభ్యుడిగా సేవలందించారు. నల్లగొండ ప్రాంతంలో ఫ్లోరోసిస్, సాగునీటి ఎద్దడి, కరవు పరిస్థితులపై పోరాటాలు చేపట్టారు. శ్రీ సుధాకర్ రెడ్డి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను..” అంటూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
……………………………………………….