
* వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తున్నాం
* సీఎస్ ఆర్ పేరుతో చెరువుల కబ్జా
* చెరువులతో పాటు నాలాలనూ నోటిఫై చేస్తున్నాం
* హైడ్రా కమిషనర్ రంగనాథ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైడ్రా.. ఒకటి రెండేళ్లకే పరిమితం కాదని కమిషనర్ రంగనాథ్ (Ranganath) స్పష్టం చేశారు. చెరువులను పరిరక్షించి ప్రస్తుతం ఆరు చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. హైడ్రా(HYdra).. వందేళ్ల ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. హైడ్రాపై ప్రజలకు మరింత క్లారిటీ రావాలి.. ముందు చెరువు ఎఫ్ టీఎల్(Ftl), బఫర్ జోన్లు (Buffer Zones)నిర్దారణ చేయాలి.. ముందు కొన్ని చెరువులకు శాంపిల్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. సాంకేతిక ఆధారాలతో చెరువు ఎఫ్ టీఎల్ ను మార్కింగ్ చేస్తున్నామన్నారు. చెరువుల వద్ద భూముల ధరలు కోట్లు పలుకుతున్నాయని, అందుకే కబ్బాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సీఎస్ ఆర్ పేరుతో చెరువులను కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. చెరువులతో పాటు నాలాలను నోటిఫై చేస్తున్నామన్నారు.
……………………………………………………….