
* గ్రామ గ్రామానికి సిసి రోడ్ల మంజూరు
* అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
* ప్రతి మహిళ మహిళా సంఘాలలో చేరాలి
* మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: మారుమూల, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పనుల జాతర కార్యక్రమాన్ని చేపట్టిందని, అన్ని గ్రామాలలో నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న రోజులలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శనివారం ములుగు మండలంలో బండరుపల్లి ఎస్సీ కాలనీ ప్రాంతంలో అంతర్గత సిసి రోడ్లు (06 వర్క్స్)29 లక్షలతో, జాకరం ఎస్సీ ప్రాంతాలలో అంతర్గత సిసి రోడ్లు & కాలువలు (11 పనులు) 58 లక్షల 50 వేలు, రూపాయలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు పనులను మంత్రి సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల కొరకు 30 లక్షల విలువ గల కొత్త మినీ బస్సు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం మల్లం పల్లి మండలం లోని శ్రీనగర్ కొత్త గ్రామ పంచాయతీ భవనం శ్రీనగర్ 20 లక్షలు, శ్రీనగర్ లో సోక్ పిట్ 92 వేలు, మల్లం పల్లి ఏస్సీ ప్రాంతంలో, సి/ఓ అంతర్గత సిసి రోడ్లు (12 పనులు) 61 లక్షలు, మహమ్మద్ గౌస్ పల్లి గ్రామం లో రోడ్లు & ఎస్సీ ప్రాంతాలలో కాలువలు (14 పనులు) 60 లక్షల 50 వేలు, రూపాయలతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్డు పనులను, శంకుస్థాపన చేసి, 10 లక్షల తో నిర్మించిన స్లాబ్ డ్రైనేజ్ కల్వర్టు, మల్లంపల్లిలో 15 లక్షల తో నిర్మించిన విలేజ్ హాట్ (వెజిటబుల్ మార్కెట్) మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రధాన రహదారులను విస్తరణ పరచడం జరుగుతున్నదని అన్నారు. రాష్ట్రంలోని ఇండ్లు లేని నిరుపేదలందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇండ్లు మంజూరు కానీ నిరుపేదలు ఎవరు ఆందోళన చెంద వద్దని తెలిపారు. ప్రతి మహిళ మహిళా సంఘాల గ్రూపులో చేరి వడ్డీ లేని రుణాలను పొందడమే కాకుండా బ్యాంకుల ద్వారా రుణాలు పొంది పలు వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగలన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, తాము ఇచ్చిన హామీ మేరకు మల్లంపల్లి గ్రామాన్ని జేడి మల్లంపల్లిగా మండలం గా ఏర్పాటు చేశామని అన్నారు. తాము అధికారికంగా ఆమోదం పొంది ఇచ్చిన హామీలను చూపిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని వివరించారు. 100 రోజుల ఈజీఎస్ పనులు పూర్తిచేసిన కూలీలను మంత్రి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీరాజ్ ఈఈ అజయ్, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జిల్లా పంచాయతీ అధికారి దేవ్ రాజ్, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………….