
* ఎవరి అభివృద్ధి కోసం పార్టీ మారాడో ఆరెకపూడి చెప్పాలి
* బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
ఆకేరు న్యూస్, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పై బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎవరి అభివృద్ధి కోసం గాంధీ పార్టీ మారారని ప్రశ్నించారు. శేరిలింగంపల్లిలో పార్టీ కార్యనిర్వాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ 18 నెలల్లో ఆరెకపూడి (AREKAPUDI) చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆరెకపూడిని ప్రజలు మడతపెట్టి కొట్టే పరిస్థితి ముందుందన్నారు. కేసీఆర్ (KCR) ను చూసే ప్రజలు గాంధీకి ఓటేశారని తెలిపారు. హైదరాబాద్లో ఎక్కడా కాంగ్రెస్ గెలవలేదని గుర్తు చేశారు. బైఎలక్షన్ లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెబుతారని, బైబై కాంగ్రెస్ (CONGRESS) అంటారని అన్నారు. మళ్లీ గెలిచే దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు.
…………………………………..