
* నేరం అంగీకరించిన హంతకుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఐదు నెలల గర్భాన్ని మోస్తున్న భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన మహేందర్ పోలీసు విచారణలో నిజాలు బైట పెట్టాడు. స్వాతిని చంపేందుకే హైదరాద్ కు మకాం మార్చానని మహేందర్ రెడ్డి వెల్లడించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ భార్యపై అనుమానంతోనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. గర్భవతి అయినప్పటి నుండి అనుమానం మరింతగా పెరిగిందని అందుకు స్వాతిని కిరాతకంగా చంపానని నేరం అంగీకరించాడు.అనుకున్న ప్రకారం స్వాతిని చంపేసి శరీర భాగాలని రంపంతో ముక్కలుగా ముక్కలుగా చేశాడని పోలీసులు తెలిపారు. కాళ్లు, చేతులు తల భాగాలను విడివిడిగా చేసిన కవర్లలో ప్యాక్ చేసి తీసుకెళ్లి మూసిలో పడవేశాడు మహేందర్. పొట్ట భాగాన్ని మాత్రం కట్ చేయకుండా ఇంట్లోనే ఉంచాడు. దీంతో ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రాసాగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారని పోలీసులు వెల్లడించారు.
…………………………………………..