
* కూకట్పల్లి బాలాజీనగర్లో ధ్వంసమైన విగ్రహం
* అంతకు ముందే ఎంతో ఘనంగా ఆగమన్ గణేశా
ఆకేరు న్యూస్, కూకట్పల్లి : హైదరాబాద్లోని కూకట్పల్లి బాలాజీనగర్లో వినాయక విగ్రహం తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రతిష్టకు ముందే నిమజ్జనం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. బాలాజీనగర్లో ఏటా భారీ విగ్రహాన్ని ప్రతిష్టించి అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఏనుగు తొండంపై గణపతి ఉండేలా భారీ విగ్రహాన్ని తయారు చేయించారు. కూకట్పల్లికా మహారాజాగా దానికి నామకరణం చేశారు. ఆగమన్ గణేశ్ పేరుతో నిన్న రాత్రి అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించారు. విజయదుర్గా టిఫిన్ సెంటర్ జంక్షన్లలో డీజేల నడుమ గణపతికి అత్యంత ఆడంబరంగా ఆహ్వానం పలికారు. అక్కడి నుంచి మండపానికి తరలిస్తుండగా విగ్రహం దెబ్బతింది. విరిగిన విగ్రహాన్ని ప్రతిష్టించడం అనర్థం అని పండితులు చెప్పడంతో నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. కాలనీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిమజ్జన ఏర్పాట్లను చేస్తున్నారు.
…………………………………..