
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారంలో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. 250 ఎకరాల భూదాన్ భూముల ఆక్రమణతోపాటు ఔషద పరిశ్రమ భూసేకరణ కింద పరిహారం పొందిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదికను తనకు అందించాలని రెవెన్యూ సెక్రటరీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
…………………………….