
* బాలిక హాస్టల్లో ఎలుకల స్వైర విహారం
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ప్రభుత్వ హాస్టళ్లలో ,వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ కు గురై విద్యార్థులు ఆస్పత్రి పాలైన ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా కరీంనగర్ జిల్లా కేశపట్నం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బాలికలు ఎలుకల బారిన పడ్డారు. విద్యాలయంలో ఎలుకలు స్వైర విహారం చేస్తూ 9 మంది బాలికలను కరిచాయి. వెంటనే బాలికలు విషయాన్ని ఎస్ ఓ మాధవికి తెలియజేశారు. ఈ విషయం బయటకి పొక్కకుండా ఎస్ ఓ మాధవి పిహెచ్ సీ కి తీసుకెళ్లి చికిత్స అందించినట్లు సమాచారం. అయితే విషయం బయటికి రావడంతో ఎంఈఓ లక్ష్మీనారాయణ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలకు వచ్చి ఆరా తీశారు. ఘటనకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య బృందం వచ్చివిద్యార్థినులను మరోసారి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.. హాస్టల్లో ఎటు చూసినా ఎలుకలు సంచారిస్తున్నాయి. ఎలకల భయం తో హాస్టల్లో ఉండాలంటే భయపడుతున్నామని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
………………………………………….