
* తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తారా
* సీఎం రేవంత్ పై హరీశ్‌రావు విమర్శలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ (Brs) హయాంలో కేసీఆర్ నిర్మించినవి ప్రారంభించడం తప్ప.. 22 నెలల్లో నువ్వ చేసింది ఏముందని ఆయనను ప్రశ్నించారు. పర్యటనకు ముందు విద్యార్థులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని, సెక్యూరిటీ, గన్ మన్లు లేకుండా ఓయూకు రాగలరా అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి(Revanthreddy)ని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదని చెప్పారు. ఎమర్జన్సీ రోజులను మళ్లీ తేవడం ఏడో గ్యారంటీనా అని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ (Jobless Calander) చేశారని, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. 22నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు (Harish Rao)డిమాండ్ చేశారు.
………………………………………