
* సీఎం ఓయూ పర్యటనపై సబిత ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓయూ విద్యార్థులంటే సీఎం రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు అని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనపై ఆమె పలువిమర్శలు చేశారు. అంత మంది పోలీసు బందో బస్తు ఎందుకు అన్నారు. విద్యార్థుల కు ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే అంత భయమా అని ఎద్దేవా చేశారు. విద్యార్థులను అదుపులోకి తీసుకొని నిషేదాజ్ఞలు విధించి ఓయూలో సీఎం పర్యటన చూస్టుంటే ఎమెర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయని సబిత అన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు రాక విద్యార్థులు పడుతున్న బాధలు ఇనుప కంచెలు పెడితే తొలిగిపోతాయా అని నిలదీశారు. ముఖ్యమంత్రివి అయి ఉండి విద్యా శాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా మీరు అని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు రూ.283 కోట్లతో విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం భవనాలు నిర్మించామని, వాటిని మీరు ఇప్పుడు ప్రారంభించటానికి వెళ్తున్నారని అన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలని, 22 నెలల్లో అందులో రెండు శాతం కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు.
…………………………….