
* బీజేపీ, బీఆర్ ఎస్ లకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సవాల్
ఆకేరు న్యూస్,మంచిర్యాల : అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు సవాల్ విసిరారు..మంచిర్యాల పట్టణంలోని వారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు.మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాద్ కు సరి సమానంగా నిలబెడతానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లేనటువంటి 400 మెగావాట్ల సబ్ స్టేషన్, మంచిర్యాల 220 మెగా వాట్లా సబ్ స్టేషన్ ను, లక్షెట్టిపేట్ లో,130 మెగా వాట్లా సబ్ స్టేషన్ ను, నస్పూర్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు వచ్చాయని అన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేది లేదని ఘాటుగా విమర్శించారు. బతుకమ్మ కానుకగా మహిళలకు శ్రీ శక్తి భవనం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు..మంచిర్యాల పట్టణంలో శిథిలా వ్యవస్థలో ఉన్న బాయ్స్ హై స్కూల్, గర్ల్స్ హై స్కూల్ భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మిస్తామని అన్నారు. మంచిర్యాల జిల్లాకు త్వరలోనే నవోదయ హై స్కూల్ మంజూరు అవుతుందని తెలిపారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.. హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద నిర్మిస్తున్న ఇండస్ట్రియల్ హబ్ ద్వారా రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు.వచ్చే వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందించి మున్సిపాలిటీ ద్వారా త్రాగునీరు, సానిటేషన్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఎవరైనా ఇబ్బందులకు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ గారు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….