
– నోడల్ అధికారులను నియమించిన కమిషనర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నిక నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజాగా ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు నోడల్ అధికారులను నియమించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశాలు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. అధికారుల వివరాలను వెల్లడించారు. బిహార్ ఎన్నికలతోపాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రావొచ్చని బల్దియా ఎన్నికల విభాగం వర్గాలు పేర్కొన్నాయి.
ఉప ఎన్నికలో ఎవరికి ఏ విధులు అంటే..
అధికారులు (బ్రాకెట్లో నిర్వహించబోయే విధులు)
‘- వెంకటేశ్వర్‌రెడ్డి, చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ (వ్యయ పరిశీలకులు)
– అనురాగ్ జయంతి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ (పోలింగ్ అధికారులు, సిబ్బంది సమీకరణ)
– అపూర్వ చౌహాన్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ (ఈవీఎం, వీవీ ప్యాట్ల నిర్వహణ)
– ఎం. సుదర్శన్, అదనపు ఎస్పీ (ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు)
– హేమంత్ కేశవ్‌పాటిల్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ (పోలింగ్ సిబ్బందికి శిక్షణ)
– నరసింహరెడ్డి, డీఎస్పీ (శాంతిభద్రతలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు)
– రవికిరణ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ (డమ్మీ బ్యాలెట్ పేపర్)
కార్తీక్ కిరణ్, అసిస్టెంట్ ఇంజనీర్, ఐటీ (హెల్ప్‌లైన్, ఫిర్యాదులు పరిష్కారం)
– తిరుమల కుమార్ (వెబ్‌కాస్టింగ్)
– చీఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ (రవాణా సదుపాయాలు)
– విల్సన్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్(ఎన్నికల పరిశీలకులు)
– ఎం. దశరథ్, పీఆర్ఓ (మీడియా కమ్యూనికేషన్ అండ్ ఎంసీఎంసీ)
– సీ రాధ, జాయింట్ కమిషనర్ (సైబర్ సెక్యురిటీ, ఐటీ, కంప్యూటరైజేషన్)
………………………………………..