
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : యూరియా కొరతపై ఆందోళనకు దిగిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. యూరియా కొరతపై ప్లకార్డులు ధరించి బషీర్ బాగ్ లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకున్న బీఆర్ ఎస్ నేతలు యూరియా కొరతపై కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. అక్కడి నుంచి నేరుగా సెక్రటేరియట్ చేరుకున్నారు.సెక్రటేరియట్ గేట్ ముందు బై ఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూరియా ను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులతో పాటు మిగతా ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలించారు.
………………………………