
* మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఈ రోజు అసెంబ్లీ ప్రాంరంభమైన మొదటి రోజు కాబట్టి అసెంబ్లీకి వచ్చానని రేపటి నుంచి అసెంబ్లీకి రానని మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి (KOMATI REDDY RAJA GOPAL REDDY) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి హైదరాబాద్ వచ్చారు. ముందుగా ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల వరదలు వచ్చి పంటలు మునిగి ప్రజలు రైతులు నష్టపోయారని ఈ సమయంలో వారికి చేదోడువాదోడుగా ఉండాలి కాని అసెంబ్లీ సమావేశాలు ముఖ్యం కాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండడమే న్యాయమని ఆయన అన్నారు. తన అనుచరులతో కలిసి భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను కలుసుకుంటానని ఆయన అన్నారు. తనకు పదవుల మీద ఆశ లేదని ప్రజలకు సేవ చేయడమే తన ప్రథమ కర్తవ్యమని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
……………………………………