
ఎన్డీఏ సభాపక్షనేతగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక
* పవన్ ను పొగడ్తలతో ముంచెత్తిన ఏపీ సీఎం
ఆకేరు న్యూస్,అమరావతి : జనసేన అధినేత,ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ది స్పందించే హృదయం అని పవన్ ఎప్పుడూ సామాన్యుడి పక్షాన ఉంటారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పవన్ కల్యాణ జన్మదినం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. మాటల్లో పదును చేతల్లో చేవ పవన్ ప్రత్యేకత అని బాబు పేర్కొన్నారు. భవిష్యత్ తో పవన్ కల్యాణ్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బాబు ఆకాంక్షించారు. రాష్ట్రాభివృద్ధిలో పవన్ అందిస్తున్న సహకారం మరువలేనిది అన్నారు.
పీపుల్ స్టార్ పవన్ కల్యాణ్: నారా లోకేష్
పవన్ కల్యాణ్ పీపుల్స్ స్టార్ గా ఎదిగారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తనను ఓ తమ్ముడిలా ట్రీట్ చేస్తారని లోకేష్ పేర్కొన్నారు.భవిష్యత్ లో పవన్ ప్రజలకు మరింత సేవలందించాలని లోకేష్ పేర్కొన్నారు.
………………………………………….