* వెలుగులోకి మరిన్ని సంచలనాలు..?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ కవిత
కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. బహిష్కరణ నేపధ్యంలో ఆమె మరిన్ని
సంచలన విషయాలను మీడియా ముందు వెల్లడించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
తన బహిష్కరణకు కారకులైన వారిపై కవిత విరుచుకుపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో ఉన్నప్పుడే పార్టీపై పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన కవిత ఇప్పుడు తన దూకుడును
మరింతగా పెంచే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఉన్నప్పుడే హద్దు రేఖ దాటిన కవితకు ఇప్పుడు
ఎలాంటి ఆటంకాలు లేవు. తాను మాట్లాడదలుచుకున్నది స్వేచ్చగా మాట్లాడే అవకాశం
కవితకు ఉంది. తన బహిష్కరణ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు.. తనను ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించారో అనే విషయాలను మీడియా ముందు చెప్పే అవకాశం ఉంది.
పార్టీలో ఉండగా బయటకు చెప్పుకోలేని కొన్ని అంశాలను ఇప్పుడు బహిర్గతం చేసే అవకాశం
ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో దయ్యాలు ఉన్నాయని కామెంట్ చేసిన కవిత
మరింత ముందుకు వెళ్లి హరీష్ రావుతో పాటు కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే
సంతోష్ రావు పైనే డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు, ఈ నేపద్యంలో ముందు ముందు కవిత
ఎలాంటి సంచలనాలను మీడియా ముందు వెల్లడించనున్నారో అనే అభిప్రాయాలు
విన్పిస్తున్నాయి. అలాగే కొత్త పార్టీ పై కూడా ఓ ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు.
……………………………………………….
