
* తాను ప్రజల వెనుకే ఉంటా
* గొప్ప పార్టీ జనతానే కనుమరుగైంది.. బీఆర్ ఎస్ ఓ లెక్కా
* కొందరి కుట్రలతో టీడీపీ సమస్యలు ఎదుర్కొంటోంది..
* కాలగర్భంలో కలిసిపోయే పార్టీ బీఆర్ ఎస్
* పాలమూరు సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ జిల్లా : వాళ్లంతా దిక్కుమాలిన వాళ్లని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే.. అలాంటి వాళ్ల వెనుక బుద్ది ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటారా అని సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలంలోని వేముల గ్రామంలో ఎస్ జీడీ ఫార్మా రెండో యూనిట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన బీఆర్ ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. హరీశ్ రావు(Harishrao), సంతోష్ రావు(Santhoshrao) ల వెనుక రేవంత్ ఉన్నారన్న కవిత వ్యాఖ్యలపైనా స్పందించారు. తాను పాలమూరు జిల్లా, నాలుగు కోట్ల ప్రజల వెనుక ఉంటానని స్పష్టం చేశారు. వాళ్ల కోసమే పని చేస్తానన్నారు. అంత పనికివాళ్తో కలిసి ఉండేంత సమయం లేదన్నారు. దయచేసి మీ కుటుంబ, కుల పంచాయితీల్లోకి మమ్మల్ని లాగకండి అని, మీ రాజకీయాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదన్నారు. కాలగర్భంలో కలిసిపోయే పార్టీ బీఆర్ ఎస్ అన్నారు. గొప్ప పేరు ఉన్న జనతా పార్టీ (Janatha Party) కనుమరుగు అయిందని, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిన అద్భుతమైన పార్టీ టీడీపీ(Tdp).. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు. దుర్మార్గాలు చేసిన బీఆర్ ఎస్ తెలంగాణలో ఎలామనుగడ సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాడు అక్రమ కేసులు పెట్టి ఎందరినో జైలుకు పంపిచారని, ఇయాల వాళ్ళే తన్నుకుంటున్నారని అన్నారు. ఒకరు ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు… ఎవరు అక్కర లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు… చేసిన పాపాలు ఎక్కడికి పోవు ఖచ్చితంగా ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి. అంటూ రేవంత్ రె డ్డి పేర్కొన్నారు. సంతోష్ రావు, హరీవ్రావు వెనుకాల రేవంత్ ఉన్నాడని ఒకడంటే, కవిత (Kavitha) వెనుక రేవంత్ ఉన్నారని మరొకడు అంటున్నారని, తనకు అంత సమయం లేదని తెలిపారు. అలాగే పాలమూరు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి అభివృద్ధి అవకాశంలో మొదటి ముద్ద పాలమూరుకే పెడతామని, ఇది నా నిబద్ధత అని స్పష్టం చేశారు. విద్యతోనే ప్రజల తలరాతలు మారతాయని తెలిపారు. గత ప్రభుత్వాలు అభివృద్ధికి కృషి చేయలేదని, అయితే ఇప్పుడు ప్రాజెక్టులకు గ్రీన్ చానల్ ద్వారా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.
……………………………….