– అన్ని రకాలుగానూ అభివృద్ధి చేసిన లే అవుట్లో..
– ఈనెల 18న ఈ-వేలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్లాట్ల వేలానికి సిద్ధమవుతోంది. అన్ని రకాలుగానూ అభివృద్ధి చేసిన స్థలాలను అమ్మకానికి సిద్ధం చేసింది. బాచుపల్లిలో లేఅవుట్లోని 70 ప్లాట్లను కొనుగోలుదారుల కోసం రెడీగా ఉన్నాయి. ఈ మేరకు ఈ వేలానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం నిర్వహించిన ప్రీబిడ్ సమావేశానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ లేఅవుట్లో ఈ నెల 18న నిర్వహించే ఆన్లైన్ ఈ-వేలంపై హెచ్ఎండీఏ అధికారులు కొనుగోలుదారులకు అవగాహన కల్పించారు. ప్లాట్లను ఆన్లైన్లో కొనుగోలు చేసే విధానం, ప్లాట్ దక్కిన తర్వాత ఫీజుల చెల్లింపులు తదితర అంశాలపై కొనుగోలుదారులు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. హెచ్ఎండీఏ ఏస్టేట్ విభాగం డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్ రెడ్డి వేలంపాట ప్రక్రియను సవివరంగా వివరించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ కామర్స్ ప్రతినిధులు ఈ-వేలంపాట విధానాన్ని దృశ్యరూపక వివరణ ఇచ్చారు.
……………………………………
