ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మైనర్పై అత్యాచారం కేసులో నిందితుడికి నల్గొండ కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 11 ఏళ్ల బాలికపై నిందితుడు తిప్పరి యాదయ్య అత్యాచారం చేశాడు. దీనిపౌ 2016లో చండూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 2018 నుంచి వాదనలు కొనసాగిస్తున్నారు, గురువారం తీర్పు వెలువరించింది. నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.35వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.10.50 లక్షల
పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
………………………………..
