* మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పేగు బంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే, పార్టీ శ్రేణులు ముఖ్యమని కేసీఆర్ నిరూపించారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ నుంచి సస్పెండైన కవిత మాటలు అర్థ రహితమని తీవ్రంగా ఖండిస్తూ, ఆమె వ్యాఖ్యలను తన విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. ఇంకోసారి హరీశ్‌రావు గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కవిత గతంలో రౌండ్ టేబుల్ సమావేశంపెట్టినా పార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవిత పని చేస్తున్నారన్నారు. పార్టీ ఉంటె ఎంత పోతే ఎంత అని కవిత మాట్లాడొచ్చా? కవితనే కేసీఆర్‌కు మచ్చ తెచ్చిందని ప్రజలు భావించారని, కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గొప్పదని ఆమె పేర్కొన్నారు. . ఈటెల రాజేందర్ బీఆర్ ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోవడంలో హరీశ్‌రావు పాత్ర లేదన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల మీద శాసనసభలో హరీష్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారని, హరీశ్ రావును టార్గెట్ చేసి కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్కు సంపద లాంటి వ్యక్తి హరీశ్‌రావు అని, ఆయనను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా..? అని ఆమె ప్రశ్నించారు.
………………………………..
