* కేసీఆర్ వెంటే మేము అని తేల్చి చెప్పిన సభ్యులు
* జాగృతిలో సామాజిక న్యాయం ఉందా అని నిలదీత
* నట్టేట మంచి నీదారి నీవు చూసుకున్నావని ఆరోపణ
* నీ స్వంత ఎజెండా తెలియక నీ వెంట నడిచాం అని ఆవేదన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు పై జాగృతి సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కవిత వ్యవహరించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ లేకుంటే కవితి ఎక్కడనుంచి వచ్చింది అని ప్రశ్నించారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కేసీఆర్ కోసం కవిత ఏం చెప్తే అది చేశామని అన్నారు. 2006 నుంచి కవిత ఏం ఆదేశిస్తే అది చేస్తూ వచ్చామని అన్నారు. ఇన్ని రోజులు కవిత వెంట ఉండి పని చేసినందుకు మాకు దక్కంది ఏంటని ప్రశ్నించారు. గత ఆరు నెలలుగా బీఆర్ ఎస్ లో జరుగుతున్న పరిణామాల గురించి కవిత ప్రశ్నిస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ తనను లెక్కచేయడం లేదని ప్రశ్నిస్తున్న కవిత మరి జాగృతి సభ్యుల గురించి ఏనాడైనా ఆలోచించారా అంటూ ప్రశ్నించారు. సామాజిక తెలంగాణ అంటూ మాట్లాడుతున్న కవితకు జాగృతిలో ఎంత సామాజిక న్యాయం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. కవిత ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నా కేసీఆర్ కోసం కవిత ఆదేశాలను పాటించామని అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ద పడ్డ కేసీఆర్ పార్టీ కోసం కన్న కూతురిపై చర్యలు తీసుకున్నారని కొనియాడారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న హరీష్ రావును విమర్శించడం పద్దతి కాదని అన్నారు. ఒక సారి ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత మరి జాగృతిలో పని చేసినందుకు మాకు ఏం లాభం జరిగిందని ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఆమె వెంట తిరిగి తమ జీవితాలనే త్యాగం చేశామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పడు మమ్మల్నందరినీ రోడ్డున పడేసి కవిత స్వంత ఎజెండాతో తన దారి తాను చూసుకున్నారని విమర్శించారు. కవిత వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
…………………………………………….
