* పార్టీకి కేసీఆరే సుప్రీం
* కవిత సస్పెన్షన్ అనంతరం హరీశ్ ఫస్ట్ రియాక్షన్
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్టీకి కేసీఆరే సుప్రీం అని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harihrao) అన్నారు. ఎవరి విషయంలోనైనా నిర్ణయం పార్టీదే అన్నారు. కలిసికట్టుగా పని చేయడం, ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ మాకు నేర్పించారని తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ప్రవాస బీఆర్ ఎస్ (Brs) నేతలతో చిట్ చాట్ లో మాట్లాడారు. గులాబీ పార్టీకి ఆటుపోట్లు కొత్తేమీ కాదన్నారు. కేసులకు భయపడని చరిత్ర బీఆర్ ఎస్ ది అన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి రేవంత్ రెడ్డి సర్కారు కమిషన్లు, విచారణలతో కాలం వెళ్లదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ (Congress) పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రాద్దాంతం చేస్తున్నారని, ఏడాదిన్నరగా ఈ ప్రభుత్వం ఏం చేస్తోందంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వానాకాలంలో విద్యుత్ కు డిమాండే ఉండదని, ఆ సమయంలో బాహుబలి మోటర్లతో నీటిని ఎత్తిపోసుకోవ్చని తెలిపారు. హైడ్రాతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని అన్నారు. ఎన్నారైలు పెట్టుబడులు పెట్టడం లేదన్నారు.
…………………………………………..
