మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
* కుటుంబ పార్టీల్లోనే ఇలాంటి గొడవలు
* సీబీఐ విచారణతో దోషి ఎవరో తేలుతుంది
* కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత చెప్పారు
* పదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు
* మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కవిత వ్యవహారం కేసీఆర్ ఇంటి సమస్య అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) తెలిపారు. వాళ్లలో వాళ్లకు ఎందుకు గొడవలు వచ్చాయో తెలియదన్నారు. కుటుంబ పార్టీల్లోనే ఇలాంటి గొడవలు జరుగుతుంటాయని వివరించారు. వాళ్ల వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ప్రధాని మోదీ(MODI)నే స్వయంగా అనేక సార్లు చెప్పారని గుర్తు చేశారు. త్వరగా సీబీఐ (CBI) విచారణ ప్రారంభించాలని కోరారు. అవసరమైతే మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తానన్నారు. రెవెన్యూ యాక్ట్ పెట్టి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని తెలిపారు. సీబీఐ జప్తు చేసే సొమ్ముతో రాష్ట్ర అప్పులు తీర్చాలన్నారు. సీబీఐ విచారణతో అసలు దోషి ఎవరో తేలుతుందన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని స్వయంగా కవిత (KAVITHA) చెప్పారని తెలిపారు. అవినీతి సొమ్ముతో హరీశ్, సంతోష్ లు విల్లాలు కడుతున్నారని విమర్శించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. బీఆర్ ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.
……………………………………
