ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో బాలాపూర్ వినాయకుడు లడ్డూకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతీ ఏడాది ఈ లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది. భక్తులు పోటీ సడి ఈ లడ్డూను స్వంతం చేసుకోవడానికి వేలం పాటలో పాల్గొంటారు. ఈ లడ్డూ సకలసంపదను తీసుకువస్తుందనే నమ్మకం ఉంది. అందుకే ప్రతీ ఏడాది ఈ లడ్డూకు డిమాండ్ పెరుగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలం పాట శనివారం నిర్వహించారు. వేలంలో 38 మంది పాల్గొన్నారు. గతేడాది రూ.30.01లక్షలు పలికిన లడ్డూ ఈ సారి రూ.35లక్షలు పలికింది. ఈ లడ్డూను కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ దక్కించుకున్నారు.
కీర్తి రిచ్చండ్ విల్లా లడ్డూ 2 కోట్ల 31లక్షల 95 వేలు
తొమ్మది రోజులు పూజలందుకున్న గణనాధుని లడ్డును సొంతం ,చేసుకుంటే అష్టైశ్వర్యాలు కలిసివస్తాయనే నమ్మకం భక్తుల్లో ఉంది, ఈ నేపధ్యంలో గణపతి వద్ద పూజలందుకున్న లడ్డును సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్‌లో మైహోం భుజాలో లడ్డూను ఖమ్మం జిల్లా ఇల్లందకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ.51,77,777 లక్షలకు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.. శుక్రవారం రాత్రి రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ లోని కీర్తి రిచ్చండ్ విల్లాలో లడ్డూ ధర 2 కోట్ల 31లక్షల 95 వేలకు విల్లావాసులు సొంతం చేసుకున్నారు.గతేడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లు పలికడం గమనార్హం.
…………………………………….
