ఆకేరున్యూస్ జనగామ : గణేశ నిమజ్జనం వేడుకలు కోలాహలంగా నిర్వహిస్తుంటారు. చిన్న పిల్లలనుండి పెద్దవాళ్ల వరకు ఈ వేడుకల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా పాల్గొంటారు. డాన్సులు చేస్తే గణనాధుడి వీడ్కోలు పలుకుతారు. ఈ మధ్య నిమజ్జనంలో మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మగాళ్లతో పాటు స్టెప్పులేస్తూ అలరిస్తున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి మెగాస్టార్ చిరంజీవి పాటకు స్పెప్పులేసి అందరినీ అలరించారు. జై జై గణేశా.. జై కొడతా గణేశా అనే పాటకు ఝాన్సీ రెడ్డి చిందులేశారు. ఆమె తో పాటు మిగతా మహిళలు కూడా చిందులేశారు. ఝాన్సీ రెడ్డి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
……………………………………..
