
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కుటుంబసభ్యలతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు సీజేకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీజే దంపతులను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.
…………………………………………..