
* పార్టీ శ్రేణులతో కేసీఆర్..?
* ఫాం హౌజ్ చేరుకుంటున్న హరీష్ రావు, బీఆర్ ఎస్ ముఖ్యనేతలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై కల్వకుంట్ల కవిత తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపధ్యంలో మొదటి సారిగా హరీష్ రావు కేసీఆర్ ను కలువబోతున్నారు. కేసీఆర్ తో పాటు పార్టీలోని ముఖ్యనేతలు ఫాం హౌస్ కు పయనమయ్యారు. ఫాం హౌజ్ లో కేసీఆర్ బీఆర్ ఎస్ నేతలకు ఏం చెప్పనున్నారనే దానిమీద ఊహాగానాలు మొదలయ్యాయి. కవిత కామెంట్స్ వల్ల పార్టీకి కొంత నష్టం జరిగిందనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కన్న కూతురే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పడంతో బీఆర్ ఎస్ వర్గాలకు ఏం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి నష్టం జరుగడమే కాకుండా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ ముఖ్యనేతలతో ఫాంహౌజ్ లో సమావేశం ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. గత రెండు మూడు రోజులు కవితతో కలిసి పనిచేసిన జాగృతి నాయకులు ఇతర బీఆర్ ఎస్ నాయకులు కవితకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టారు. కవితకు వ్యతిరేకంగా ధర్నాలు కూడా జరిగాయి, సోషల్ మీడియాలో కవితకు వ్యతిరేకంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఇవి అన్నీ బీఆర్ ఎస్ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని కేసీఆర్ ఆలోచన అందుకే ఫాం హౌజ్ లో ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.కొంత కాలం కవిత కామెంట్స్ కు దూరంగా ఉండాలని కవిత వ్యాఖ్యలపై ఎవరూ స్పందించ కూడదని చెప్పే అవకాశం ఉంది. కవితపై దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపై స్పందించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ సూచించే అవకాశం ఉందని భావిస్తున్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో యూరియాపై ఆందోళనలు చేయాలని సూచించే అవకాశం ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థులు వస్తున్న నేపధ్యంలో ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికట్లో పార్టీ సత్తా చూపెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. నిజానిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ చూసే ఫలితాలపైను బీఆర్ ఎస్ పార్టీ మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇవన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే కేసీఆర్ ఫాం హౌజ్ సమావేశంలో పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
………………………………………….