
* మంత్రి జూపెల్లి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్ గద్వాల : బీఆర్ ఎస్ మాజీ లీడర్ కల్వకుంట్ల కవితపై మంత్రి జూపెల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో బీజేపీలో దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన కామెంట్స్ ను మంత్రి జూపెల్లి గుర్తు చేశారు. బీఆర్ ఎస్ లో ఉన్న దెయ్యాలతో పాటు కవిత కూడా ఓ కొరివి దెయ్యం లాంటిదని అన్నారు. జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తో జూపెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా జూపెల్లి మాట్లాడుతూ బీఆర్ ఎస్ పెద్దలు ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో పతరేసి కుటంబస్వామ్యాన్ని నడిపిస్తున్నారని అన్నారు. కవితకు నిజాయితీ ఉంటే పదేళ్లలో జరిగిన అవినీతిని బట్టబయటు చేయాలని సూచించారు.త బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవితనే చెప్పారని తెలిపారు.
……………………………………….