
* దుబాయ్ లో ప్రకటించిన కమల్
* స్వయంగా ప్రకటించిన కమల్‌హాసన్
ఆకేరు సినిమా డెస్క్ : ఇద్దరూ..ఇద్దరే ఒకరు తనదైన మేనరిజమ్స్ తో తనదైన స్టైల్ లో భారతీయ చలనచిత్రసీమలో సూపర్ స్టార్ గా వెలుగుతుంటే మరొకరు అనితరసాధ్యమైన నటనతో.. నటనలో తనకు తానే సాటి తనకు తానే పో టీ అని నిరూపించుకున్న నటుడు ఆ ఇద్దరే ..సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్.. లోక నాయకుడు లోకనాయక్ కమల్ హాసన్.. ఇప్పుడు వీరిద్దరి కలయికలో త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో సినిమా రాబోతోంది.. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించారు. దుబాయ్‌లో జరిగిని సైమా సినిమా వేడుకలో కమల్ హాసన్ ఈ విషయాన్ని ప్రకటించారు.1970 దశకం నుంచి వీరిద్దరూ కలిసి సమాంతరంగా సినిమా ప్రయాణం చేస్తున్నారు సహజ దర్శకుడు కే బాలచందర్ శిష్యరికంలో హీరోగా అరంగేట్రం చేసిన వీరిద్దరూ గురువు తగ్గ శిష్యులు అన్పించికున్నారు. అప్పట్లో వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇద్దరికీ అభిమానులు ఎక్కువే..ఇద్దరు కలిసి నటించిన సినిమాల్లన్నీ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురుపించాయి.తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ – 5 భాషలలో 21 చిత్రాలలో కలిసి పనిచేశారు. ఇందులో 3 ద్విభాషా తప్పు తలంగల్ (తమిళం – కన్నడ), అలవుద్దీనుమ్ అత్బుత విళక్కుం (తమిళం – మలయాళం) మరియు నినైతలే ఇనిక్కుం (తమిళం – తెలుగు) ఉన్నాయి.కె.బాలచందర్ వీరిద్దరికీ దర్శకత్వం వహించిన 7 చిత్రాలలో అపూర్వ రాగంగల్, అంతులేని కథ, మూడు ముడిచు, అవర్గళ్, తప్పు తలంగల్, నినైతాలే ఇనిక్కుం మరియు తిల్లు ముల్లు.శ్రీప్రియ కమల్ మరియు రజనీ ఇద్దరూ నటించిన 6 చిత్రాలలో నటించింది. ఈ చిత్రాల జాబితాలో ఇల్లమై ఊంజలదుకిరాతు, ఆడు పులి ఆటం, అల్లాదినుమ్ అద్భుత విలక్కకుమ్, అవల్ అప్పటితేన్, వయసు పిలిచింది, నచ్చతిరమ్ ఉన్నాయి.కమల్, రజనీ ఇద్దరూ కలిసి నటించిన మూడు సినిమాల్లో శ్రీ దేవి నటించింది. ఇందులో మూండ్రు ముడిచు, పతినారు వాయతినిలే మరియు తైల్లమల్ నన్నిలై ఉన్నాయి.అంతులేని కథ మరియు నినైతలే ఇనిక్కుం అనే 2 చిత్రాలలో జయప్రద కమల్ మరియు రజనీతో కలిసి నటించింది.నచ్చతిరం, శరణం అయ్యప్ప మరియు ఉరువంగల్ మరాళం చిత్రాల్లో ఇద్దరూ అతిథి పాత్రలు పోషించారు.కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన అపూర్వ రాగంగల్, తైల్లమల్ నన్నిలై మరియు గెరాఫ్తార్ చిత్రాల్లో రజనీకాంత్ అతిథి పాత్రలు పోషించారు.ఈ సినిమాలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరో హీరో.2020లో రజనీకాంత్, కమల్ కలిసి లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయాలనే ప్లాన్ చేయగా, అది కరోనా వలన ఆగింది. అయితే ఆ తర్వాత కమల్‌తో లోకేష్.. విక్రమ్ అనే సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు. ఇక ఇటీవల రజనీకాంత్‌తో కూలీ తీసాడు లోకేష్.ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ (కమల్ హాసన్) మరియు రెడ్ జెయింట్ మూవీస్ (ఉదయనిధి స్టాలిన్) సంయుక్తంగా నిర్మించనున్నట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న ఇద్దరి కలయికలో సినిమా వస్తోందంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి..
……………………………………