ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొక్కుల సంపత్ కుమార్ అమెరికాలో నిర్వహించే ఫుల్బ్రెట్ టీచర్ ఎక్చేంజ్ శిక్షణకు ఎంపికయ్యాడు. సెప్టెంబర్10 నుంచి అక్టోబర్ 27, 2025 ఆరు వారాల పాటు ఫుల్బ్రైట్ టీచింగ్ శిక్షణ కార్యక్రమంలో ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని, ఉత్తమ బోధనా పద్ధతులను పంచుకోవడానికి, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను అర్థం చేసుకోవటానికి,సమన్వయం అవడానికి ఈ వేదిక దోహదపడుతుందని ఆయన చెప్పారు.కాగా ఈ శిక్షణ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రతి సంవత్సరం దరఖాస్తు చేసుకుంటారు. ఈ సంవత్సరం మనదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ ఒకరు, తెలంగాణ నుంచి ఇద్దరు మొత్తంగా ముగ్గురు మాత్రమే ఎంపికయ్యారు.
………………………………
