దిగొచ్చిన నేపాల్
ఆకేరు న్యూస్ డెస్క్: నేపాల్ (NEPAL) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశంలో ఒక్క రోజులోనే పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రశాంతంగా ఉన్న దేశం ఆందోళనలతో అట్టుడికిపోయింది. నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ను దేశంలో నిషేదించిన నేపధ్యంలో నిన్న నేపాల్ దేశం మొత్తం హింసాత్మక ఘటనలతో ఉద్రిక్త పరిస్థితిల్లోకి నెట్టివేయబడింది. సోషల్ మీడియా బ్యాన్ కు వ్యతిరేకంగా విద్యార్థులు,యువకులు,దేశ పౌరులు, వ్యాపారులు,జర్నలిస్టులు అంతా ముక్తకంఠంతో ప్రభత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర మైన ఆగ్రహం వ్యక్తం చేశారు,ఈ ఘటనల నడుమ హోంమంత్రి రమేశ్ లేఖక్ (RAMESH LEKHAK)తన పదవికి రాజీనామా చేశారు. ప్రాణ నష్టాలను చూసి నిశ్శబ్దంగా ఉండలేనని ఆయన ప్రకటించారు. ఈ రాజీనామా ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచింది.చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలి (KP SHARMA OLI)సోషల్ మీడియాపై తాను తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తగ్గారు.ఈ క్రమంలోనే నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించిన తన ముందు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్ సమాచార, ప్రసార శాఖ మంత్రి పృథ్వీ సుబ్బా గురుంగ్ (PRITHVI SUBBA GURUNG)తెలిపారు. కాగా ఈ హింసాత్మక ఘటన్లో 20 మంది ప్రాణాలు పోగా 347 మందికి గాయాలయ్యాయి. నేపాల్ ప్రభుత్వంపై ఒక రకంగా ప్రజలు తిరుగుబాటు చేశారనే చెప్పవచ్చు. ప్రభుత్వం తమ గొంతు నొక్కాలని చూస్తోందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి ప్రజాగ్రహానికి ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
………………………………………….
