* గెలుపు అవకాశాలు లేకపోయినా పోటీలో కాంగ్రెస్ కూటమి
* మొదలైన ఓటింగ్.. రాత్రికి ఫలితాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ మొదలైంది. ఓట్లు వేసేందుకు పార్లమెంట్ నూతన భవన్ లోకి ఎంపీలు వస్తున్నారు. ఎన్డీఏ నుంచి సీపీ రాధాకృష్ణన్, ఇండి కూటమి నుంచి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరూ దక్షిణాదికి చెందిన వారే కావడం గమనార్హం. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెజారిటీ లేకపోయినా ఇండి కూటమి అభ్యర్థిని పోటీలో నిలపడం ఆసక్తిగా మారింది. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌కు 324 మంది ఎంపీల మద్దతు, ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు 439 మంది ఎంపీల మద్దతు ఉంది. రాధాకృష్ణన్‌పై సుదర్శన్ రెడ్డి విజయం అంత ఈజీ కాదు. క్రాస్ ఓటింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు.
క్రాస్ ఓటింగ్‌కు చాన్స్
రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటీకీ తన పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా
చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Elections) అని వార్యమయ్యాయి. ఎన్డీఏ ఏకగ్రీవం కోసం ప్రయత్నించినప్పికీ సాధ్యం కాలేదు. కాంగ్రెస్ కూటమి కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ కూటమి నుంచి పోటీలో ఉన్న సుదర్శన్ రెడ్డ తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అయితే
వారు తమ పార్టీకే ప్రాధాన్యం ఇస్తారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో పాల్గొనే ఎంపీలకు పార్టీ విప్ వర్తించదు. దీంతో క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రెండూ కూటములూ అప్రమత్తమయ్యాయి. గెలిచే అవకాశం లేకపోయినా తమ బలం ఏంటో
నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పోటీలో నిలిచింది.
ఈ రాత్రికే ఫలితాలు
మొత్తం లోక్‌సభలో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 239 మంది సభ్యులు
ఉన్నారు. వీరంతా కలిసి మొత్తం 781 మంది ఉన్నారు. ఇందులో ప్రతి సభ్యుడి
ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391 కాగా, బీఆర్ఎస్ (4),
బీజేడీ (7)లు పోలింగ్‌కు దూరంగా ఉంటామని ప్రకటించాయి. దీంతో 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలువనున్నారు. తెలంగాణ వ్యక్తి పోటీలో నిలిచినప్పటికీ ఓటింగ్ కు దూరమని బీఆర్ ఎస్ ప్రకటించడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ ఎస్ కు తెలంగాణ తత్వం లేదని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కాగా, ఇప్పటికే ప్రారంభమైన పోలింగ్ సా.5 గంటల వరకు కొనసాగనుంది. రాత్రికి ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది.
………………………………..
