* నేపాల్ భారతీయులకు ప్రభుత్వం సూచన
ఆకేరున్యూస్, డెస్క్ : తాజాగా నేపాల్ దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
భారతప్రభుత్వం నేపాల్ లో ఉన్న భారతీయులకు సూచనలు,హెచ్చరికలు జారీచేసింది.
సోషల్ మీడియా యాప్స్‌ను ఆదేశం నిషేదించడంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున్న ఆందోళనలు,హింసాత్మక సంఘటనలు జరిగిన నేపధ్యంలో భారత ప్రభుత్వం అక్కడి ఉంటున్న భారతీయులకు ఈ మేరకు హెచ్చరికలు జారీచేసింది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరు సహనంతో వ్యవహరించి, సమస్యలను శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని వెల్లడించింది. భారత ప్రభుత్వం మంగళవారం నేపాల్‌లోని భారత పౌరులకు కీలక సూచన జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో నేపాల్‌లోని పరిస్థితిని గమనిస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు, నిబంధనలను పాటించాలని తెలిపింది.
………………………………………..
