* గ్రూప్ 1 పరీక్ష ఫలితాల రద్దుపై ఎమ్మెల్యే హరీష్ రావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు
ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు.
గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎక్స్ వేదికగా
ఆయన స్పందించారు. విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం
ఆడుతున్నారన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి స్పందించాలని హరీష్ అన్నారు.
ప్రభుత్వ చేతకాని తన్నాన్ని హైకోర్టు తీర్పు బట్టబయలు చేసిందని పేర్కొన్నారు.
హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడ్డ నీ నిర్లక్ష్యానికి
విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారు. పరీక్షలు నిర్వహించడం,
ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం అంటే విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి
చిల్లర రాజకీయాలు చేయడం కాదని హరీష్ పేర్కొన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరువు.
నీ నిర్లక్ష్య, మోసపూరిత వైఖరికి సిగ్గుతో తలదించుకో. తెలంగాణ యువతకు
క్షమాపణ చెప్పు.’ అంటూ ఘాటైన వ్యాఖ్యలతో హరీష్ రావు పోస్ట్ చేశారు.
…………………………………
