* ఓటు వేసిన మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్
* వీల్ చైర్లో వచ్చిన మాజీ ప్రధాని దేవెగౌడ
ఆకేరు న్యూస్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా
(PRIYANKA GANDHI)పార్లమెంట్ లో అందరినీ ఆకట్టుకున్నారు. గులాబీ రంగు చీర నల్లరుంగు జాకెట్ ధరించినప్రియాంకా గాంధీ పార్లమెంట్ భవనం చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆమె తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన వంతు వచ్చేవరకూ ఆమె క్యూలో నిలబడి నిరీక్షించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, సీనియర్ నేత జైరామ్ రమేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ వీల్‌చైర్‌పై పార్లమెంటుకు వచ్చి ఓటు వేశారు.కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, చిరాగ్ పాశ్వాన్, కిషన్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తదితర ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
…………………………………….
