
* సీఎం కార్యాలయం, మెడికల్ కాలేజీలకు..
* అప్రమత్తమైన బాంబ్ డిటెక్షన్, డిస్పోసల్ టీమ్స్
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ లకు మంగళవారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. వెంటనే భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ-మెయిల్లో ఏంఏఎంసీలో మధ్యాహ్నం 2జ45 గంటలకు, సీఎం కార్యాలయంలో సుమారు 3.30 గంటలకు పేలుళ్లు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో వెంటనే బాంబ్ డిటెక్షన్, డిస్పోసల్ టీమ్స్, స్పెషల్ సెల్, సైబర్ పోలీసులు, ఫైర్ సర్వీసు, డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టాయి. సందర్శకులను బయటకు తరలించారు. కాసేపు ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి. అయినా భద్రతా బలగాల వేగవంతమైన చర్యలతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎటువంటి బాంబులు లేవని అధికారులు గుర్తించారు.
………………………………………….