
* కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శ్రీనివాస్
* తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు
ఆకేరు న్యూస్, హనుమకొండ: కాళోజీ నారాయణ రావు సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి ఆరాధ్యుడయ్యాడని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి. శ్రీనివాస్ అన్నారు. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)హనుమకొండలో మంగళవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి శ్రీనివాస్ కాళోజి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రజాకవి కాళోజీ తెలంగాణ వైతాళికులు, ధిక్కార కవి, నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజల గొడవనే తన గొడవగా మలచుకున్నటువంటి మహనీయుడన్నారు. అన్యాయాన్ని ఎదిరించినోడు తనకు ఆరాధ్యుడని, తెలంగాణ చరిత్ర మొత్తం నా గొడవ రూపంలో ప్రజలకు అందించి, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజా కవి కాళోజీ అని కొనియాడారు. తదనంతరం తెలుగు శాఖ పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసింది.ఈ కార్యక్రమాలలో కళాశాల వైస్ ప్రిన్సిపాళ్ళు శ్రీమతి డి.రజనీలత, డాక్టర్ డి.రాజశేఖర్, ఐక్యూఏసి కన్వీనర్ డాక్టర్ ఏ. శ్రీనాథ్, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శివ నాగ శ్రీను, తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ ఎం. సమత, డాక్టర్ జె.రమేష్, డాక్టర్ జి.మహేందర్, డాక్టర్ బి సీతారాములు, పి శ్రీనివాస్, కళాశాల స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ బి రవి కుమార్, కళాశాల లైబ్రరీ లైబ్రేరియన్ డాక్టర్ భరత్, పి.డి డా శశికాంత్,డాక్టర్ ఈ.కోమల ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
…………………………………………